టాలీవుడ్ లేడీ అమితాబ్ విజయశాంతి 13 సంవత్సరాల గ్యాప్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నసరిలేరు నీకెవ్వరు సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగు ఇండస్ట్రీకి విజయశాంతి విజయనిర్మల దర్శకత్వంలో వచ్చిన కిలాడీ కృష్ణుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అప్పటినుంచి ముందుకు అడుగులేస్తూ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో హీరోలకు దీటుగా సినిమాలు తీస్తూ లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకుంది.
తరువాత రాజకీయాల్లోకి వెళ్లిన ఈ లేడీ డాన్ సినిమాలకు దూరం అయింది. దాదాపుగా పదమూడు సంవత్సరాల తరువాత మళ్ళీ వెండితెర మీద విజయశాంతి కనిపించబోతుంది. అప్పుడు మహేష్ బాబు తండ్రి అయిన సూపర్ స్టార్ కృష్ణ సరసన ఎంట్రీ ఇచ్చిన లేడీ అమితాబ్ ఇప్పుడు కొడుకు మహేష్ బాబు సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్, రష్మిక మందన్న జంటగా వస్తున్న ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్లో విజయశాంతి కనిపించనుంది. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది.