సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్ వేడుకల్లో విజయశాంతి, మెగాస్టార్ చిరంజీవిలు చేసిన సందడి అభిమానులను కట్టిపడేస్తోంది. వారిద్దర్నీ అలా చూడటం భలే ఉందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకల్లో చిరు మరి చిన్న పిల్లాడిలా మారిపోయి విజయశాంతితో తన మెమొరీస్ ను గుర్తు చేసుకొని కాసింత ఉద్వేగానికి గురయ్యాడు. అదే సమయంలో విజయశాంతి కూడా చిరుతో తన స్నేహం గురుంచి చెప్పుకొచ్చింది. మంచి రోల్ ను పోషించాల్సి వస్తే సినిమాలో నటించేందుకు తనకెలాంటి బేషజాలు లేవని చెప్పిందట లేడీ అమితాబ్. ఇక మెగాస్టార్ చిరంజీవి విజయశాంతిలు కలిసి మళ్ళీ నటిస్తే చూడాలని మెగా అభిమానులతోపాటు రాములమ్మ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అందుకే చిరు తాను తరువాత చేయబోయే సినిమాలో విజయశాంతిని తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయాన్నీ మెగాస్టార్ దర్శకులకు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్న సినిమా స్క్రిప్ట్ లో చిన్న మార్పులు చేసి విజయశాంతిని తీసుకోవాలని కొరటాల శివను కలిసి చిరంజీవి సూచించినట్లు సమాచారం. ఇది కుదరకపోతే తరువాత త్రివిక్రమ్ సినిమాలో అయినా ఈ లేడీ అమితాబ్ ను తీసుకోవాలని కోరినట్లు చిత్ర పరిశ్రమలో టాక్ వినిపిస్తుంది.
గతంలో టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతిల కాంబినేషన్ సూపర్బ్ గా ఉండేది. వీరిద్దరి కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద భలే కలెక్షన్స్ ను రాబట్టేవి. 19 సినిమాల్లో జోడిగా నటించగా 10సినిమాలు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. ఇక 1993లో బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ‘మెకానిక్ అల్లుడు’ తర్వాత వీళ్లిద్దరు మళ్లీ సినిమా చేయలేదు. అప్పట్లో విజయశాంతికి, చిరంజీవి, బాలకృష్ణ మధ్య ఏదో మనస్పర్ధలు వచ్చాయని టాలీవుడ్ లో పెద్ద చర్చే నడిచింది. దీంతో బాలకృష్ణ, చిరంజీవిలు తమ తదుపరి సినిమాలో విజయశాంతిని తీసుకోవద్దనే నిర్ణయానికి వచ్చినట్లు ఊహాగానాలు వినిపించాయి. ఆ తరువాత ఒసేయ్ రాములమ్మ సినిమాలో నటించిన విజయశాంతికి అవకాశాలు తగ్గాయి. దీంతో ఆమె పాలిటిక్స్ లోకి ఎంటరవ్వడంతో మళ్ళీ సినిమాల వైపు తొంగిచూడలేదు. 13ఏళ్ల విరామం అనంతరం తాజాగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరుతో వియయశాంతి మళ్ళీ సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చింది.