నెల్లూరు జిల్లాలో మహిళా కానిస్టేబుల్స్ డ్రెస్ ల కోసం మగ టైలర్ కొలతలు తీసుకోవడంపై వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అడిషనల్ ఎస్పీ వెంకటరత్నం మీడియాతో మాట్లాడారు. అనుమతి లేకుండా ఫొటోలు తీసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మహిళా పోలీసులు కోరినట్లు తెలిపారు.
మహిళలను కించ పరిచేలా పోస్టులు పెడితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు వెంకటరత్నం. మెజర్ మెంట్స్ ను మహిళా అధికారుల సమక్షంలో లేడీ టైలర్స్ తీసుకొంటున్నారని వివరించారు.
మెజర్ మెంట్స్ ఎలా తీయాలో చూపిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఫొటోలు తీసినట్లు తెలుస్తోందన్నారు అడిషనల్ ఎస్పీ. లోపలికి ప్రవేశించిన వ్యక్తి మహిళా పోలీసుల కుటుంబ సభ్యుడు అనుకున్నట్లు తెలిపారు.
కొలతల విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు వెంకటరత్నం. నిజానిజాలు తెలుసుకొని మీడియాలో కథనాలు ప్రసారం చేయాలని అన్నారు.