హైదరాబాద్ రాజేంద్రనగర్ లో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు చేదించారు. ప్రాన్స్ దేశానికి చెందిన మేరీ 30 సంవత్సరాల క్రితం హైదరాబాద్ కు వచ్చి ఇక్కడే సెటిల్ అయింది. కాగా రాజేంద్రనగర్ లో మేరిక హై స్కూల్ నిర్వహిస్తుంది. అయితే మేరీ…. రోమా, ప్రియాంక లను దత్తత తీసుకొని పెంచుకుంది. రోమా కు మ్యాట్రిమోనియా సైట్ లో విక్రమ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.
రోమా, విక్రమ్ ఇద్దరు పెళ్లి చేసుకుకోవలని డిసైడ్ అయ్యారు. రోమా, విక్రమ్ పెళ్లిని నిరాకరించిన తల్లి మేరీ. పెళ్లికి మేరీ నిరాకరించడంతో పరిచయం ఉన్న రాహుల్ అనే వ్యక్తి తో రోమా, విక్రమ్ .. మేరీ హత్యకు స్కెచ్ వేశారు. ఇంట్లో మేరీ ఒంటరిగా ఉందనే సమాచారంతో విక్రమ్, రాహుల్ కలిసి చంపేశారు. ఇక డెడ్ బాడీని కారులో తీసుకెళ్లి.. హిమయత్ సాగర్ లో పడేశారు. అయితే ఇప్పుడు మేరీ హత్య కేసులో రోమా, విక్రమ్, రాహుల్ లను రాజేంద్ర నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.