ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల వేళ.. వివిధ పార్టీల్లో టికెట్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. అవకాశం దక్కనివారు పార్టీ అధిష్టానాలపై వివిధ రకాలుగా నిరసన తెలుపుతున్నారు. కేరళలో అయితే సాక్షాత్తు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలికే టికెట్ దక్కలేదు. దీంతో ఆమె ఊహించని రీతిలో పార్టీ అధిష్టానానికి తన నిరసన తెలిపారు.
రాజధాని తిరువనంతపురంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట కూర్చుని లతికా సుభాష్ గుండు చేయించుకున్నారు. అనంతరం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షురాలికే టికెట్ ఇవ్వలేకపోతే పార్టీనే నమ్ముకున్న ఇతరులకు ఇంకా ఎలా న్యాయం చేస్తారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర ఏ పార్టీలోనూ చేరబోనని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళలో కాంగ్రెస్‌ను ఇరుకునపెట్టే లా కనిపిస్తోంది.