సమాజంలో నేరపరంపర కొనసాగుతోంది. ఎస్సై అయితేనేం ఒకమహిళే కదా అనే చులకన భావమో. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే ఉన్మాదమో. తెలియదు కానీ.. ఓ మహిళా ఎస్సైపై దుండగులు కత్తులతో దాడి చేసారు.ఈ దారుణ సంఘటన ఒరిస్సాలో చోటుచేసుకుంది. భువనేశ్వర్ లోని మహిళా పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ శుభశ్రీ నాయక్(36) సోమవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి బైలుదేరింది. అయితే ఆమె ..రిజర్వ్ బ్యాంక్ ప్రాంతానికి చేరుకున్నప్పుడు, కొందరు దుండగులు ఆమెని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు.
తనకి అనుమానం రావడంతో శుభశ్రీ తన వేగాన్ని మరింత పెంచింది. దుండగులు కూడా వేగం పెంచారు, ఆమెని వెంబడించి కత్తులు, తల్వార్లతో బెదిరించారు. అంతేకాదు…అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరంగా మాట్లాడారు.
‘ఈ రోజు మా చేతుల్లో అయిపోయావ్’ అంటూ వార్నింగులు ఇచ్చారు. అయితే శుభశ్రీవారి మాటలకు రెచ్చిపోకుండా,తెలివిగా వ్యవహరించింది. ఆ దుండగుల కళ్ళుగప్పి వారి బారినుంచి తప్పించుకుంది.
అనంతరం ఈ ఘటనపై శుభశ్రీ భువనేశ్వర్ పోలీస్ స్టేషన్ ఫిర్యారు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల్ని పట్టుకునే పనిలో నిమఘ్నమయ్యారు. ఆ ప్రాంతాల్లోని సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.
ఇదిలా ఉండగా..ఎస్ఐ శుభశ్రీనాయక్ కు డిపార్ట్మెంట్ లోని మంచి పేరుంది. కరోనా లాక్ డౌన్ సమయంలో పలువురికి సహాయం చేసారు. పేదవారికి భోజనం అందించారు. ఆమె సేవలను గుర్తించి … మెగాస్టార్ చిరింజీవి సహా కొందరు ప్రముఖులు శుభశ్రీని అభినందించారు.