రాష్ట్రంలో కొంతకాలంగా వచ్చిన వైరల్, డెంగ్యూ ఫీవర్లు జనాల జేబులకే కాదు… ప్రభుత్వ ఖజానాకు గండికొట్టినట్లు కనపడుతోంది. రాష్ట్రంలో వీరవిహారం చేసిన రోగాలకు ప్రభుత్వ దవాఖానలకు కేటాయించిన మందులు అయిపోయాయి. దీంతో కొత్త మందులు కొనాలని , అందుకు బడ్జేట్ కేటాయించాలని కోరుతూ ఆసుపత్రి వర్గాలు ప్రభుత్వానికి నివేధిక పంపించాయి.
గత మూడు నాలుగు నెలలుగా రాష్ట్రంలో ఏ ఆసుపత్రి చూసిన ఫుల్‌గా కనపడింది. ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైన రోగాల పాలయ్యారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం చేయించుకోవటంతో…. 40కోట్ల మెడిసిన్ రోగులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 10కోట్ల మెడిసిన్ సిద్ధంగా ఉన్నా… ఇంకా ఫీవర్ల సీజన్ కొనసాగుతుండటం, పైగా వెదర్ చేంజ్ పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో మెడిసిన్ కొరత ఏర్పడుతుందని ఆసుపత్రి వర్గాలు భావిస్తున్నాయి.
ఈ ఏడాది 226కోట్ల బడ్జేట్ కేటాయించింద ప్రభుత్వం. గతేడాది 332కోట్లు కేటాయించగా ఈసారి బడ్జేట్ భారీగా తగ్గించింది. అయితే గతేడాది పంపిణీ చేసిన మందుల బిల్లులకే ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో మందులు సరఫరా చేసే కంపెనీలు, ఏజెన్సీలు పాత బిల్లుల కోసం పట్టుబడుతుండటంతో మందులు సరైన సమయానికి ఆసుపత్రులకు చేరటం అనుమానంగానే కనపడుతోంది. ఇప్పటికే మందుల కొనుగోలుకు టీఎస్‌ఎంఐడీసీ ప్రభుత్వానికి నివేధిక ఇచ్చినట్లు తెలుస్తోంది.
మరీ, తెలంగాణ ప్రభుత్వం మందులను సకాలంలో కొనుగోలు చేసి ప్రజలకు అందిస్తుందో…. ఖజానా ఖాళీ పేరుతో జాప్యం చేసి ప్రజల ప్రాణాల మీదకు తెస్తుందో చూడాలి.