లఖింపుర్ ఖేరీ కేసులో కేంద్ర మంత్రి కుమారుడు ఆశీశ్ మిశ్రాకు బెయిల్ పిటిషన్ పై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వులో పెట్టింది. ఈ పిటిషన్ పై ఈ రోజు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్బంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితులను ఎల్లకాలం నిర్బందించలేమని పేర్కొంది.
ఈ కేసులో అత్యంత దారుణంగా జైలులో మగ్గిపోతున్నది రైతులేనని వ్యాఖ్యానించింది. ఆశీశ్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేయకపోతే వారు కూడా జైళ్లోనే ఉండిపోయే అవకాశం ఉందని తెలిపింది. అనంతరం బెయిల్ పిటిషన్ పై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్ చేసింది.
వాదనల సమయంలో ఆశిశ్ మిశ్రా బెయిల్ పిటిషన్ను యూపీ సర్కార్ వ్యతిరేకించింది. ఎనిమిది మంది రైతుల ప్రాణాలు పోవడానికి కారకుడైన వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తే అది సమాజంలోకి తప్పుడు సంకేతాలను పంపిస్తుందని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
2021 అక్టోబర్ 3న యూపీలోని లఖింపుర్ ఖేరీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేపట్టారు. ఆ సమయంలో నిరసన చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు తన వాహనాన్ని ఎక్కించారు .ఆ మసయంలో ఆశిశ్ మిశ్రా వాహనంలోనే ఉన్నారు.
ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించారు. అనంతరం హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఈ ఘటనల్లో మరో నలుగురు మృతి చెందారు. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఆశిశ్ మిశ్రాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలంటూ రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.