యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధి భక్తులతో కోలాహాలంగా ఉంది. ఏకాదశి సందర్భంగా పూజారుల వేదమంత్రాల నడుమ లక్ష పుష్పార్చన జరిపారు. వేకువజామున సుప్రభాతం.. ఉదయాన నిజాభిషేకం.. మహామండపంలో లక్ష పుష్పార్చనతో యాదాద్రీశుడి సన్నిధి ఆధ్యాత్మిక వేడుకలతో సందడిగా మారింది.
లక్ష పుష్పార్చన పూజల్లో పాల్గొన్న భక్తులకు, పూజ విశిష్టతను తెలియజేశారు. ఈ మరోవైపు వార్షిక బ్రహ్మోత్సవాలకు ఫిబ్రవరి 21న ప్రారంభం కానున్నాయి. పదకొండు రోజుల పాటు పాంచారాత్రాగమ విధానాలతో నిర్వహించనున్నారు.
అంతే కాకుండా మార్చి1న దివ్యవిమాన రథోత్సవ వేడుక, 2న చక్రతీర్థం, 3న మూలవరులకు విశిష్ట అభిషేకం నిర్వహించనున్నట్లు యాదాద్రి దేవస్థానం తెలిపింది. భక్తులు పై సమాచారం తెలుసుకొని యాదాద్రి దర్శనం చేసుకొగలరని ఆలయ అధికారులు పేర్కొన్నారు.