తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ ముహుర్తాన అన్ స్టాపబుల్ షోలో అడుగుపెట్టారో.. అప్పటి నుంచి రాజకీయపరంగా ఎంతో హీట్ రాజుకుంది. ఫస్ట్ ప్రోమో రిలీజ్ చేసినప్పుడే ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ టెలీకాస్ట్ అవుతుందా? అని రాజకీయ నాయకులతో పాటు సదరు జనాలు కూడా ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూశారు. చంద్రబాబుని, బాలకృష్ణ ఏం ప్రశ్నలు వేశారు? దానికి చంద్రబాబు ఏం సమాధాలు ఇచ్చారో.. అని ఈ ఎపిసోడ్ పై ఎంతో ఆసక్తి నెలకొంది.
మొత్తానికి ఈ ఎపిసోడ్ రిలీజ్ కావడంతోనే పలు వివాదాలకు వేదికైంది. తాజాగా ఈ ఎపిసోడ్ పై ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి స్పందించారు. చంద్రబాబు, బాలయ్య తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈ షోను ఎంచుకున్నారని, అందులో వారు చెప్పిన ఏ విషయం కూడా కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు.
1995 నాటి ఘటనపై చంద్రబాబు వివరణ ఇచ్చారు. ఆ సమయంలో ఎన్టీఆర్ కాళ్లు కూడా పట్టుకుని బతిమిలాడాని చెప్పారు. ఆ రోజు ఏం జరిగింది అంటూ చెప్పుకొచ్చారు. దీంతో చాలా వరకు ఉన్న అనుమానాలకు వారు తెరదించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌తో కలిసి పనిచేసిన సమయంలో, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన సమయంలో కీలక పరిణామాలను చంద్రబాబు వివరించారు.
ఆ వ్యాఖ్యలను లక్ష్మీ పార్వతి ఖండించింది. పార్టీలో గొడవలు చంద్రబాబే చేయించాడు. అతనే ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా రోడ్డు మీదకు పిలిచింది.. ఎమ్మెల్యేలను రెచ్చగొట్టిచింది.. ఇవన్నీ నిజాలని ఆయనను ఒప్పుకోమనండని సవాల్ విసిరారు లక్ష్మీ పార్వతి. చంద్రబాబు ఎన్టీఆర్ కాళ్లను పట్టుకున్నాడన్నది పచ్చి అబద్దమని తేల్చి చెప్పారు.
ఈ రోజు ఈ షో చూశాక బాలకృష్ణ అంటే పరమ అసహ్యమేస్తోందని.. ఛీ ఛీ అసలు అతను ఎన్టీఆర్ కొడుకేనా అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. ఈ షో చూస్తున్నంత సేపు ఎన్టీఆర్ కు ఎవరైతే వెన్నుపోటు పొడిచారో వారిద్దరూ ఒకరినొకరు సమర్దించినట్లు కనిపించదనన్నారు. సాక్ష్యాలు బయటపడడంతో ఈ విధంగా కప్పిపుచ్చుకుంటున్నాడని చెప్పుకొచారు. కాగా ప్రస్తుతం లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.