మాజీ సీఎమ్ ఎన్టీఆర్ రెండవ భార్య, వైసీపీ నేత లక్ష్మీ పార్వతి టీడీపీ నేతలపై మండిపడ్డారు. న్యాయ వ్యవస్థపై ఎదురు దాడి చేసే తప్పుడు సంస్కృతికి ప్రధాన ప్రతిపక్షం తెరతీసిందని విమర్శలు గుప్పించారు.విశాఖలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వ్యక్తి పాద యాత్ర చేయడానికి తయారయ్యాడని ఎద్దేవా చేశారు. ఫైబర్ నెట్ స్కామ్ లో దోపిడీకి పాల్పడ్డ వాడు నీతిమంతుడి గా ప్రజల ముందుకు వస్తున్నాడు.
కేంద్రం సీరియస్ గా దృష్టి సారిస్తే యువ నాయకుడికి జైలు ఖాయం అన్నారు. సంస్కార హీనమైన మాటలు మాట్లాడుతున్న వాళ్ళను చూస్తే వాళ్ళ పుట్టుక సక్రమ మైనదేనా అనే అనుమానం కలుగుతోంది.వందరూపాయలు చీర, పురుగుపట్టిన కందిపప్పు ఇస్తామని పిలిచి అమాయక మహిళల ప్రాణాలు తీశారు. టీడీపీ నాయకులకు అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా వాళ్ళకు ప్రత్యేక రాజ్యాంగం ఉందా.?
చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు..అన్ స్టాపబుల్ లో హంతకులు ఇద్దరు ఒకరిని ఒకరు సమర్ధించుకున్నట్టు అనిపించింది. ప్రతిపక్షాలు ప్రజాకంటకంగా మారాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తెచ్చిన అమరావతికి ఆత్మగౌరవాన్ని ఆపాదించడాన్ని విమర్శించారు లక్ష్మీపార్వతి.సిపిఐ నారాయణ, రామకృష్ణ లు తమ పార్టీలను చంద్రబాబుకు తాకట్టు పెట్టారని విమర్శించారు.
చంద్రబాబు మనసు, శరీరం కుళ్ళి పోయాయి.. ఎన్.టి.ఆర్ కు చేసిన మోసం, అన్యాయాలకు క్షోభించి క్షీణించిపోయే రోజులు చంద్రబాబు కు ఎంతో దూరంలో లేవు. సహవాస దోషంతో పవన్ కళ్యాణ్ తప్పుడు మార్గంలో పయనిస్తున్నారు. చంద్రబాబుతో కలిసి వెళ్లడం వల్ల పవన్ కళ్యాణ్ కు నష్టం తప్ప లాభం ఉండదన్నారు లక్ష్మీపార్వతి.