సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన చిత్రం లక్ష్య. విలువిద్య నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ చిత్రం ఇటీవల ఓటిటి లో రిలీజ్ అయింది. థియేటర్స్ లో అనుకున్న స్థాయిలో విజయం సాధించలేక పోయినప్పటికీ ఓటిటి లో మాత్రం మంచి విజయం సాధించింది.
నాగ శౌర్య ఇంకో చిత్రం వరుడు కావలెను కూడా ఓటిటి లో రిలీజ్ కాగా ఈ చిత్రం మూడు రోజులకి గాను 50 మిలియన్ వ్యూ మినిట్స్ అందుకోగా.. లేటెస్ట్ గా ఆహా లో రిలీజ్ అయ్యిన లక్ష్య చిత్రానికి ఏకంగా నాలుగు రోజుల్లో 100 మిలియన్ వ్యూ మినిట్స్ అందుకొని సరికొత్త రికార్డుఅందుకుంది.
ఇక నాగశౌర్య ప్రస్తుతం హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. పోలీసువారి హెచ్చరిక సినిమాతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నాడు నాగ శౌర్య.