తక్కువ కాలం పదవిలో ఉన్నప్పటికీ ఓ గొప్ప ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి మంచి పేరు తెచ్చుకున్నారు. దేశంలో వ్యవసాయ విప్లవానికి నాంది పలికి కొత్త చరిత్ర సృష్టించారు. దురుద్దేశంతో భారత్ పై దండెత్తిన దాయాది పాక్ కు తగిన గుణపాఠం చెప్పారు. మరోవైపు అణ్వాయుధాలు సమకూర్చుకోవడం ద్వారా భారత్ ను రక్షణ పరంగా శత్రు దుర్భేద్య దేశంగా రూపొందించాలని ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు.
ఆయన ప్రధాని పదవిలో ఉంటూనే తష్కంట్‌లో మృతి చెందారు. తొలి నుంచి ఆయన మృతిపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఆయన ఎలా మృతి చెందారనే విషయం ఇటీవలే వెల్లడైనది. అణ్వాయుధాలను సమకూర్చుకోవాలని భారత్ నిర్ణయించుకుందని అమెరికా నిఘా సంస్థ సీఐఏకు తెలిసింది.
దీంతో ఆ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆయన్ని సీఐఏ కుట్ర పూరితంగా హతమార్చినట్టు ఇటీవల బహిర్గతమైంది. ఆయనతో పాటు అణ్వయుధాల రూపకల్పనలో తలమునకలైన డాక్టర్ హోమీ జహింగర్ బాబాను కూడా సీఐఏ హత మార్చినట్టు వెల్లడైంది.
భారత్ బలమైన శక్తిగా ఎదగడం ఇష్టం లేని అమెరికా ఆ మేరకు భారత ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఎన్నో పన్నాగాలు పన్నుతూ వచ్చింది. నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలోనూ నాసిరకపు గోధుమలను భారత్‌కు పంపించింది. అటు ప్రజారోగ్యానికి, పంటలకు, వ్యవసాయానికి, నేలలకు చాలా ప్రమాదకరంగా ఉండే పార్థీనియం గడ్డిని భారత్ లో ప్రోత్సహించింది. తద్వారా దేశంలోని వ్యవసాయ భూములను కలుషితం చేసింది. ఇలా భారత ఆర్థిక వ్యవస్థ, ప్రజారోగ్యాన్ని నాశనం చేసే ప్రయత్నాలు చేసింది.
‘సీఐఏ డైరెక్టరేట్ ఆఫ్ ఆపరేషన్స్‌లో సెకండ్-ఇన్-కమాండ్ రాబర్ట్ క్రౌలీ (కోవర్ట్ ఆపరేషన్స్ ఇన్‌ఛార్జ్) గురించి ప్రముఖ రచయిత గ్రెగొరీ డగ్లస్ ‘కాన్వర్సేషన్ విత్ ది క్రో’అనే పుస్తకాన్ని రచించారు. అందులో శాస్త్రీ, హోమీబాబాల హత్యకు చేసిన కుట్రలు చేసిన్నట్లు పేర్కొన్నాడు. భారత అణు శాస్త్ర పితామహుడు హోమీ జహంగీర్ బాబాను, ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రిలను సీఐఏ చంపిందని క్రౌలీ అంగీకరించినట్టు పుస్తకంలో ఆ రచయిత స్పష్టంగా వివరించారు.
భవిష్యత్‌లో అమెరికా ఆధిపత్యానికి భారత్ అడ్డుగా నిలుస్తారని అనుకుని వారిని అడ్డు తొలగించుకునేందుకు రహస్య ఆపరేషన్లు చేసింది. దీంతో సీఐఏ చాలా అపఖ్యాతిని మూటగట్టుకుంది. లాల్ బహదూర్ శాస్త్రీ యూపీలోని మొగల్ సరాయ్ గ్రామంలో 1904 అక్టోబర్ 2న జన్మించారు. ఆయన తల్లి దండ్రులు శారదా ప్రసాద్ రాయ్, రామ్‌దులారీ దేవీలు.