ఓవైపు వరుసపెట్టి సినిమాలు చేస్తున్న రజనీకాంత్, మరోవైపు ఓ గెస్ట్ రోల్ చేయడానికి కూడా రెడీ అయ్యారు. నిజానికి ఇలాంటి టైమ్ లో రజనీకాంత్ అతిథి పాత్రలు పోషించాల్సిన అవసరం లేదు. అంత టైమ్ కూడా లేదు. కాకపోతే కూతురు డైరక్ట్ చేస్తున్న మూవీ కావడంతో సూపర్ స్టార్ కు తప్పలేదు. ఆ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో ‘లాల్ సలాం’ సినిమా రూపొందుతోంది. ఇటీవల పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుంచి ప్రారంభమైంది. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తోన్న ఈ చిత్రంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
లాల్ సలాం సినిమా లో ఓ వపర్‌ఫుల్ పాత్ర ఉంది. దాన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లే గొప్ప నటుడు కావాలంట. అందుకే సూపర్‌స్టార్ రజినీకాంత్ ని రిక్వెస్ట్ చేశారంట. లైకాతో ఉన్న అనుబంధంతో రజనీకాంత్ వెంటనే అంగీకరించారు.
ఎనిమిదేళ్ల తర్వాత ఐశ్వర్య రజినీకాంత్ మళ్లీ మెగా ఫోన్ పట్టారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. విష్ణు రామస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.