బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం లాల్ సింగ్ చద్దా. అమీర్ ఖాన్ టైటిల్ రోల్‌లో నటించినఈ చిత్రం రిలీజ్ ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా ఇప్పుడు మరోసారి వాయిదా పడింది.ఈ మేరకు అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
అనుకున్న చిత్రీకరణను పూర్తి చేయలేకపోవడంతో ఈ సినిమాను వాయిదా వేసినట్లు యూనిట్ ప్రకటించింది. అలాగే, ఈ చిత్రాన్ని ఆగస్ట్ 11, 2022న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
వాస్తవానికి ఈ చిత్రం ఏప్రిల్ 14, 2022న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు మేకర్స్. ఇక లాల్ సింగ్ చద్దాలో కరీనా కపూర్, నాగ చైతన్య, మోనా సింగ్ లు కీలక పాత్రలలో నటిస్తున్నారు.
అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 1994లో విడుదలైన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫారెస్ట్ గంప్ కు రీమేక్ గా తెరకెక్కుతుంది.
#LaalSinghChaddha @Viacom18Studios @TSeries pic.twitter.com/dZBVkNiIyc
— Aamir Khan Productions (@AKPPL_Official) February 15, 2022