అద్వైత్ చందన్ దర్శకత్వం అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం లాల్ సింగ్ చద్దా. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య కూడా నటిస్తున్నారు. అలాగే అమీర్ ఖాన్ సరసన కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం నాగ చైతన్య లుక్ పూర్తిగా మార్చుకున్నాడు. దేశ రక్షకుడిగా పూర్తి స్థాయిలో మేకోవర్ అయ్యారు. అందుకు సంబంధించి జిమ్ లో కఠినమైన వర్కౌట్లు చేశాడు.
ఇదిలా ఉండగా తాజాగా చిత్ర యూనిట్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసింది. ఈ మేరకు యూనిట్ సభ్యులు అంతా కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. అలాగే లాల్ సింగ్ చద్దా డిసెంబర్ 24 న విడుదల కానుంది.