జైల్లో ఉంటూనే రాజకీయం నడిపిస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ చీప్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు అధికారులు వీఐపీ సదుపాయాల్లో కోత పెట్టారు. ఇటీవల అనారోగ్యానికి గురైన లాలూకి రాంచీలోని రిమ్స్‌లోని డైరెక్టర్ బిల్డింగ్‌లో చికిత్స అందిస్తుండగా..ఆయన్ను పేయింగ్ వార్డుకు తరలించారు. ఆస్పత్రిలో ఉన్నప్పటికీ లాలూ.. బీజేపీ ఎమ్మెల్యేలతో ఫోనులో మాట్లాడుతున్నారని, స్పీకర్ ఎన్నికను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారంటూ ఇటీవల కొన్ని ఆడియో రికార్డులు బయటపడ్డాయి. దీంతో ఈ విషయాన్ని జార్ఖండ్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఫోన్ కాల్ ఉదంతంపై విచారణకు సర్కారు విచారణకు ఆదేశించింది.
దానా కుంభకోణం కేసుల్లో దోషిగా తేలడంతో 2017 డిసెంబర్ 23 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కొన్ని కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ.. మరికొన్ని కేసుల్లో పెండింగ్‌లో ఉండటంతో లాలూ ఇంకా జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలోనే అనారోగ్యం బారినపడటంతో… కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా లాలూకు వీఐపీ బిల్డింగ్‌లో ఇన్నాళ్లు చికిత్స అందించారు.