పాండెమిక్ సమయంలో వ్యాక్సిన్లతో కొవిడ్ మరణాల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు లాన్సెట్ జర్నల్ వెల్లడించింది. వ్యాక్సిన్ల వల్ల మరణాల సంఖ్య మూడోవంతుకు తగ్గిపోయిందని జర్నల్ పేర్కొంది.
భారత్ లో 2.3 నుంచి 5.3 మిలియన్ల మరణాలను వ్యాక్సిన్లు అడ్డుకున్నట్టు జర్నల్ తెలిపింది. 2021లో సుమారు 42 లక్షల మరణాలను వ్యాక్సిన్ అడ్డుకున్నట్టు జర్నల్ తెలిపింది.
2021 చివరి నాటికి రెండు లేదా అంతకంటే ఎక్కువ మోతాదులతో ప్రతి దేశంలోని జనాభాలో 40 శాతం మందికి టీకాలు వేయాలనే ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యం నెరవేరితే ప్రపంచ వ్యాప్తంగా మరో 599,300 మంది ప్రాణాలను రక్షించగలిగే వాళ్లని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా, మహమ్మారి సమయంలో కొవిడ్-19 వ్యాక్సిన్‌లు సంభావ్య మరణాల సంఖ్యను దాదాపు 10 లక్షలు లేదా వాటి అమలు తర్వాత సంవత్సరంలో సగానికి పైగా తగ్గించాయని గణిత మోడలింగ్ అధ్యయనం కనుగొంది .
మొదటి సారి టీకా కార్యక్రమం ప్రవేశ పెట్టిన సంవత్సరంలో 185 దేశాలు, భూభాగాల నుండి వచ్చిన అదనపు మరణాల ఆధారంగా అంచనాల ప్రకారం….ప్రపంచ వ్యాప్తంగా సంభావ్య మరణాలు 31.4 మిలియన్ల ఉండగా అందులో 19.8 మిలియన్ల మరణాలను వ్యాక్సిన్లు నిరోధించినట్టు పరిశోధకులు తెలిపారు.
భారత్ లో ఈ కాలంలో 42,10,000 మరణాలను టీకాలు అడ్డుకున్నాయని జర్నల్ విశ్లేషించింది. పాండెమిక్ సమయంలో 51,60,000 మరణాలు సంభవిస్తాయని అంచనావేయగా కేవలం 5,24,941 మరణాలు మాత్రమే సంభవించాయని తెలిపింది. ఈ సంఖ్యకు అంచనా మరణాల సంఖ్య 10 రెట్లు ఉండటం గమనార్హం.