ల్యాండ్ బ్యాంక్ కు వ్యవసాయ భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు వరంగల్ జిల్లా రైతులు. పైడిపల్లి, అరేపల్లి రైతులు తమ పొలాల్లోని పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలకు రాఖీలు కట్టి వినూత్న నిరసన తెలియజేశారు. తరతరాలుగా భూమిని నమ్ముకొని సాగు చేస్తున్నామని.. తమను నడిరోడ్డుపైకి లాగే ప్రయత్నం మానుకోవాలని వేడుకున్నారు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోయినా, ఉపాధి కల్పించకపోయినా వ్యవసాయం చేసుకొని కుటుంబాల్ని పోషిస్తున్నామని.. ప్రైవేట్ పేరుతో తమ భూములను లాక్కొనే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.
రెండు పంటలు పండే వ్యవసాయ భూములను అడ్డదారిలో లాక్కోవాలని చూస్తున్న ప్రైవేట్ ఏజెన్సీ భూముల సర్వేను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు రైతులు. తమను మభ్యపెట్టి, అబద్ధాలతో, అడ్డదారిలో.. పట్టాదారు పాస్ బుక్, సర్వే నెంబర్లు, ఫోన్ నెంబర్లు సేకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ల్యాండ్ బ్యాంక్ ను వెంటనే ఆపాలని.. మధ్యప్రదేశ్, గుజరాత్ కు చెందిన యువకులు చేసిన దొంగ సర్వే రిపోర్టును తొలగించాలని అన్నారు రైతులు.