బంజారాహిల్స్ లో భూ కబ్జాదారులు మరోసారి రెచ్చిపోయారు. 220 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నం చేశారు. పార్థసారథి అనే వ్యక్తి పోలీస్ కమాండ్ కంట్రోల్ వెనక ఉన్న ఖాళీ స్థలంలో రేకులతో షెడ్ లు నిర్మించాడు. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు వాటిని తొలగించాలని అన్నారు. అయితే, అధికారులపై కూడా వారు దాడికి దిగారు. షేక్ పేట్ రెవెన్యూ అధికారులకి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో, బంజారాహిల్స్ పోలీసులకు రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. 10రోజుల క్రితమే కబ్జా దారులపై కేసు నమోదైంది. అయినా తమ వెనక ఎవరు ఉన్నారని దైర్యమో తెలియదు కానీ.. లెక్కచేయకుండా మరోసారి కబ్జాకు ప్రయత్నించారు.
Tolivelugu Latest Telugu Breaking News » Crime » రెచ్చిపోయిన భూకబ్జాదారులు