ఎమ్మార్వో విజయారెడ్డి హత్యలో భూమాఫియా హస్తం ఉన్నట్లు పోలీసుల విచారణలో ప్రాథమిక సమాచారం లభించినట్లు తెలుస్తోంది. అబ్ధుల్లాపూర్ మెట్ పరిధిలో రియల్టర్ల ఆగడాలకు విజయారెడ్డి సహకరించటం లేదన్న కోపానికి తోడు… ఎంతో విలువైన బాచారం భూమిలో తమకు సహకరించలేదన్న కారణంతోనే సురేష్‌ను పావుగా వాడుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
నిందితుడు సురేష్ వాంగ్మూలాన్ని రికార్డు చేసిన పోలీసులు… సురేష్ కాల్ రికార్డును పరిశీలిస్తే చివరిసారిగా రియల్టర్లతో ఫోన్ మాట్లాడిన విషయం పడినట్లు సమాచారం అందుతోంది. దీనిపై పోలీసులు అధికారికంగా స్పందించాల్సి ఉంది.
అయితే సురేష్ అధికార టీఆరెఎస్ పార్టీ క్రీయాశీలక కార్యకర్తల్లో ఒకరని, ఆయనకు స్థానిక టీఆర్ఎస్ నేతల అండదండలు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.