నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని కిష్టరాయునిపల్లి వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టులో ముంపుకు గురవుతున్న ప్రజలు ఆందోళన చేపట్టారు. తమకు పునరావాసం, నష్టపరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలంటూ లక్ష్మాపూర్ వాసులు పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలం వద్ద నిర్వాసితులను అడ్డుకునే ప్రయత్నం చేయటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, గ్రామస్తులకు తోపులాట జరిగినట్లు తెలుస్తోంది. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు ఈడ్చుకెళ్లారని గ్రామస్తులు మండిపడుతున్నారు. తమకు పరిహారం చెల్లించాకే పనులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.