భారతదేశం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌కు సంబంధించి మరో కీలక మైలురాయిని అధిగమించింది. ఈ నౌకపై స్వదేశీ తేలికపాటి యుద్ధ విమానం తొలిసారిగా ల్యాండ్ అయ్యింది. ఓ ఫిక్స్‌డ్ వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ .. విక్రాంత్‌పై దిగడం కూడా ఇదే తొలిసారని భారత నౌకాదళం తెలిపింది.
విమాన వాహకనౌకలు, యుద్ధ విమానాల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ పరంగా భారత్ సామర్ధ్యాన్ని తాజా ఘటన ప్రదర్శిస్తుందని వెల్లడించింది. ఇకపోతే.. దాదాపు 20 వేల కోట్లతో నిర్మించిన ఐఎన్ఎస్ విక్రాంత్‌ను గతేడాది సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే.
దీని అభివృద్ధికి మిషన్ కు నాయకత్వం వహించిన తేజస్ మాజీ టెస్ట్ పైలట్, కమోడోర్ జైదీప్ మావోలంకర్ దీనికి ముందు అధిగమించిన సవాళ్లను మీడియాతో పంచుకున్నారు. ఈ ప్రయోగం అనేది నిజంగా సూదిలోనికి దారం ఎక్కించడం లాంటిది. కచ్చితమైన ప్రదేశంలో కాకుండా విమానంలోని ఏ ఒక్క భాగామైన కానీ అధిక ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి.
జెట్ వేగాన్ని 130 నాట్లు (240 కి.మీ) వేగంతో ఉంచడానికే ప్రయత్నిస్తాము. కచ్చితంగా 90 మీటర్లలో మేము వేగాన్ని గంటకు 240 కి.మీ నుంచి దాదాపు 2.5 సెకన్లలో సున్నాకి తీసుకురావడానికి ప్రయత్నిస్తామని వివరించారు.పైలట్‌లు ఫ్లైట్ డెక్‌పై దిగినప్పుడు మరియు 2.5 సెకన్లలో గంటకు 240 కిమీ నుండి 0 వరకు వేగాన్ని తగ్గించేటప్పుడు శారీరక సవాళ్లను ఎదుర్కొంటారని పేర్కొన్నారు.
భారతదేశానికి చెందిన ఇతర విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యలో తేజస్ విమానం ల్యాండ్ అయినప్పుడు దానిని పరీక్షించి, ఇంజినీరింగ్ చేసిన బృందంలో కమోడోర్ మావోలంకర్ కూడా ఉన్నారు.కాగా 45వేల టన్నుల బరువున్న ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను రూ.20వేల కోట్ల వ్యయంతో నిర్మించి గతేడాది సెప్టెంబర్‌లో నావికాదళంలో ప్రవేశపెట్టారు.
262మీటర్ల పొడవు, 62మీటర్ల వెడల్పు ఉన్న భారీ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను భారత్‌లో తయారుచేశారు. మిగ్ 29కె ఫైటర్ జెట్స్, హెలికాప్టర్లతోపాటు మొత్తం 30విమానాలను తీసుకువెళ్లగల సామర్థం ఐఎన్‌ఎస్ విక్రాంత్‌కు ఉంది. ఈ యుద్ధనౌకలో సుమారు 1600మంది నేవీ సిబ్బంది ప్రయాణించవచ్చు.