బ్రెజిల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా అట్లాంటిక్ తీరప్రాంతంలో కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, చెరువులు పొంగి పొరులుతున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి.
వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో పెర్నాంబుకో ప్రాంతంలో 33 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు. సుమారు 765 మంది నిరాశ్రయులైనట్టు అధికార వర్గాలు తెలిపాయి.
పెర్నాంబుకో పక్క నగరం అల్గోవాస్‌లోనూ భారీ వర్షాలకు ఇద్దరు మరణించినట్టు అధికారులు పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ లోనూ బ్రెజిల్ లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో దాదాపు 50 మంది దాకా మరణించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఫెడరల్ టాస్క్ ఫోర్స్ ను పెర్నాంబుకో ప్రాంతానికి పంపుతున్నట్టు దేశ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనోరో తెలిపారు. భారీ వర్షాలకు మృతి చెందిన వారికి తన ప్రగాఢ సంతాపాన్ని ఆయన తెలిపారు.