హిమాచల్ ప్రదేశ్‌లోని సంగ్లాలో కొండచరియలు బీభత్సం సృష్టించాయి. ఉన్నట్టుండి పెద్ద కొండపై నుంచి అత్యంత వేగంతో కిందకు.. పెద్ద పెద్ద బండరాళ్లు దొర్లుకుంటూ వచ్చాయి. కొండ దిగువన ఉన్న నదిపై కట్టిన బ్రిడ్జి, దాని పక్కనే ఉన్న సెక్యూరిటీ రూంపై పడ్డాయి. బండరాళ్ల ధాటికి వంతెన కుప్పకూలింది. సెక్యూరిటీ గదులు ధ్వంసం అయ్యాయి.10 నిమిషాల వ్యవధిలో అల్లకల్లోలం జరిగిపోయింది. చూసేది సినిమా గ్రాఫిక్సా.. లేక నిజంగానే జరిగిందా అన్న అనుమానాలు కలిగించేలా ఈ ఘటన దృశ్యాలు ఉన్నాయి.
ప్రమాదంలో 9 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కిన్నౌర్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం ఇది. బండరాళ్లు పడుతున్నట్టు గ్రహించిన చాలా మంది తమ తమ గదుల్లోకి పరుగులు తీసినప్పటికీ.. ఆ విషయం తెలియని కొందరు వాహనాల్లో ఉండిపోయారు. వారిపై బండరాళ్లు పడిపోయాయి. దీంతో వారు అక్కడే మరణించారు.