హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఐదో నెంబర్ జాతీయ రహదారిపై ఒక్కసారిగా పెద్దపెద్ద కొండరాళ్లు వచ్చి పడ్డాయి. వాహనదారులు ముందుగా గమనించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
కొండచరియల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. పూర్ సమీపంలోని జియోరి వద్ద జరిగిందీ ఘటన. బండరాళ్లు రోడ్డుపై పడడంతో అక్కడున్న వారంతా కేకలు పెడుతూ పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వర్షాకాలం కావడంతో భారీ వర్షాలు పడుతున్నాయి. వాటి కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. గత నెలలో చండీగఢ్-మనాలి జాతీయ రహదారిలోనూ పడ్డాయి.