18 అడుగుల పొడవు.. 98 కిలోల బరువు కలిగిన అతిపెద్ద కొండ చిలువ యూఎస్ లో బయపడింది. దీనిని యూఎస్ పరిశోధకులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఫ్లోరిడా రాష్ట్రంలో ఇప్పటివరకూ కనిపించిన అతిపెద్ద కొండచిలువ అని పరిశోధకులు పేర్కొన్నారు.
ఈ కొండచిలువ లోపల 122 గుడ్లున్నట్లు సౌత్-వెస్ట్ ఫ్లోరిడా కన్జర్వెన్సీ పరిశోధకులు గుర్తించారు. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. అది చనిపోయి ఉందని పరిశోధకులు తెలిపారు.
చనిపోయిన ఆ కొండచిలువకు పరిశోధకులు శవపరీక్ష చేశారు. అది చివరగా జింకను తిన్నట్లు గుర్తించారు. దాని కడుపులో అత్యధికంగా 122 గుడ్లున్నట్టు పేర్కొన్నారు.
బర్మీస్ పైథాన్స్ ప్రపంచంలోని అతిపెద్ద పాములలో ఒకటి. ఇవి ఆగ్నేయాసియాలో ఎక్కువగా కనిపిస్తాయి. ఐయూసీఎన్ రెడ్ లిస్ట్‌లో హాని కలిగించే జాబితాలో ఉన్నాయి.