అసలే ఎండలు మండిపోతున్నాయి. ఎండనుండి ఉపసమనం కోసం ఓ బీరు తాగుదామనిపోతే.. రేట్లు మండిపోతున్నాయి. అలాంటి పరిస్థితిలో కండ్ల ముందే బీర్ బాటిల్ లు కనిపిస్తే.. ఇంకేముంది పండగే పండగా..! అలాంటి ఘటనే ఏపీలో జరిగింది.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు వద్ద నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం జిల్లా రుణస్థలం నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లెకు బీరులోడుతో వెళ్తున్న ఓ లారీ బోల్తాపడింది.
ఆ వాహనంలో ఉన్న బీరు బాటిళ్లన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ సమాచారం తెలియడంతో అక్కడికి భారీగా జనం చేరుకున్నారు. బీరు సీసాల కోసం మందుబాబులు ఎగబడ్డారు.
ఎవరికి దొరికిన సీసాలు వారు పట్టుకుని అక్కడినుంచి వెళ్లిపోయారు. సుమారు 12 వందలకు పైగా బీరుకేసుల లోడుతో వెళ్తున్న లారీ.. ప్రమాదావశాత్తు డివైడర్ దిమ్మెను ఢీకొనటంతో ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు.