సాయంత్రం వేళ విహారానికి కేరాఫ్ అడ్రస్ గా హైదరాబాద్ వాసులను అలరిస్తున్న ట్యాంక్ బండ్ కు సరికొత్త అందాలు తోడవనున్నాయి. ట్యాంక్ బండ్ కు పెరుగుతున్న పర్యాటకుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఆదివారం మధ్యాహ్నం తర్వాత ట్రాఫిక్ ను అనుమతివ్వటం లేదు. కేవలం పర్యాటకులకే అనుమతి ఉంటుంది.
ట్యాంక్ బండ్ పై చిన్నారులను మరింత అలరించేందుకు ఇక లేజర్ షోను ఏర్పాటు చేయబోతున్నారు. ప్రేక్షకుల కోసం ప్రత్యేక గ్యాలరీలను కూడా ఏర్పాటు చేయబోతున్నారు.