అక్రమ లేఔట్లను రెగ్యూలరైజ్ చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ పై హైకోర్టు విచారించింది. నాలుగు వారాల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే, ఎల్ఆర్ఎస్ పై సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
రిజిస్ట్రేషన్ల నిలిపివేత, ఎల్ఆర్ఎస్ వేర్వేరని పేర్కొన్న పిటిషనర్… నాలుగు వారాలైనా కౌంటర్ దాఖలు చేయట్లేదని ఆరోపించారు. దీంతో ప్రభుత్వంపై ఆగ్రహాం వ్యక్తం చేసిన హైకోర్టు, కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి హైకోర్టు చివరి అవకాశం ఇస్తూ… తదుపరి విచారణను జూన్ 15కు వాయిదా వేసింది.