సంక్రాంతి బరిలో ఉన్న మాస్ మహారాజ్ రవితేజ సినిమా క్రాక్. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రిలీజ్ కావాల్సి ఉన్న క్రాక్ మూవీ చివరి నిమిషంలో విడుదల ఆగిపోయింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సినిమా విడుదలను నిర్మాత ఠాగూర్ మధు నిలిపేశారు. అమెరికాలో ప్రీమియర్స్ నిలిచిపోయాయి.
నిర్మాత ఠాగూర్ మధు ఓ తమిళ ప్రొడ్యూసర్ కు 6కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనిపై అతడు చెన్నై కోర్టును ఆశ్రయించగా… కోర్టు సినిమా నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వటంతో విడుదలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్ అలంకర్ ప్రసాద్ కూడా పెండింగ్ డ్యూస్ క్లియర్ చేయాలని ఫిల్మ్ ఛాంబర్ ను ఆశ్రయించాడు.
అయితే, ఈ సమస్యలన్నీ మద్యాహ్నాం వరకు తొలగిపోతాయని… ఆ తర్వాత సినిమా రిలీజ్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమాగా చెప్తోంది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ-శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా ఠాగూర్ మధు ఈ మూవీని తెరకెకక్కించారు.