భారత గాన కోకిల గా గుర్తింపు పొందిన లతా మంగేష్కర్ కన్నుమూసారు. జనవరిలో కరోనాతో ఆస్పత్రిలో చేరిన లతా మంగేష్కర్ ఆదివారం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1929 సెప్టెంబర్ 28న మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో లతా మంగేష్కర్ జన్మించారు.
ఇక పదమూడేళ్ల వయసులోనే సినీ రంగ ప్రవేశం చేశారు గానకోకిల. 1949లో మహల్ సినిమా లో హాయిగా హాయిగా పాటతో లైమ్ లైట్ లోకి వచ్చారు. ఎన్నో పాటలు పాడిన లతా మంగేష్కర్ 1969లో పద్మభూషణ్, 1989లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.
1999 లో ఎన్టీఆర్ జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. అలాగే పద్మ విభూషణ్ అవార్డు ను కూడా. 2001లో భారతరత్న కూడా పొందారు. శాంతినికేతన్, విశ్వభారతి, శివాజీ విశ్వవిద్యాలయాల గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్నారు లతా మంగేష్కర్.
980 సినిమాలకు పాటలు పాడిన లతమంగేష్కర్ తెలుగులో మూడు పాటలు మాత్రమే పాడారు. ఏఎన్ఆర్ సంతానం సినిమా లో నిదురపోరా తమ్ముడా, 1965 లో ఎన్టీఆర్ దొరికితే దొంగలు సినిమా లో శ్రీవేంకటేశ పాట, నాగార్జున ఆఖరిపోరాటం సినిమాలో మరో పాటను పాడారు.
Advertisements
లతా మంగేష్కర్ అత్యధికంగా హిందీ, మరాఠీ, భాషలో పాటలు పాడారు మొత్తం 170 మంది సంగీత దర్శకుల వద్ద పని చేసిన ఆమె ముప్పై వేలకు పైగా పాటలు పాడారు. ఇక లతా మంగేష్కర్ మృతిపై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ లు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.