ముంబయి : దేశం గర్వించే గాయనీమణి లతా మంగేష్కర్ ఇంటికి విశిష్టవ్యక్తి అతిధిగా వచ్చారు. మహారాష్ట్ర పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ లెజెండరీ గాయని నివాసానికి వెళ్లి ఆమెను పలకరించారు. వారాంతంరోజు ముంబయిలోని లతా మంగేష్కర్ నివాసానికి వెళ్లిన రాష్ట్రపతి కాసేపు ఆమెతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమెకు ఓ జ్ఞాపికను బహూకరించారు.
రాష్ట్రపతి అంతటివారు తన ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని లతాజీ ట్వీట్ చేశారు. కోవింద్‌తో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశారు. ‘మన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నన్ను కలవడానికి మా ఇంటికి రావడాన్ని గౌరవంగా భావిస్తున్నా. సర్.. మీరు మేం గర్వపడేలా చేశారు’ అంటూ గానకోకిల ట్వీట్ చేశారు.