సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఆదివారం కాలర్ బోన్ సర్జరీ తర్వాత తేజ్ వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారన్న వైద్యులు… తేజ్ కోలుకుంటున్నట్లు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
రెండ్రోజుల క్రితం సాయి ధరమ్ తేజ్ తన స్పోర్ట్స్ బైక్ వెళ్తూ హైదరాబాద్ ఐకియా స్టోర్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ రోజు నుండి తేజ్ హైదరాబాద్ అపోలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.