పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదు. పవన్ కళ్యాణ్ సినిమా వచ్చింది అంటే ఫ్యాన్స్ లో ఉండే ఉత్సాహం అంతాఇంతా కాదు. పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్ చూస్తే అర్ధం అయిపోతుంది. అయితే ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నాడు పవన్. అందులో ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ కాబోతుంది.
మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కోషి సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో రానా కూడా మరో హీరోగా నటిస్తున్నారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ గతంలో పవన్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ కు మించి జరుగుతుందట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్లకు పైగానే ఉందట. కాగా దీనిపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది.
ఇక పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నాడు. వీటితో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు.