కరోనా కారణంగా చాలా వరకు పెద్ద సినిమాలు రిలీజ్ డేట్ లను వాయిదా వేసుకున్నాయి. ఆ లిస్టులో ఇప్పటికే భీమ్లా నాయక్, ఆర్.ఆర్.ఆర్, సర్కారు వారి పాట, రాధేశ్యామ్, ఆచార్య చిత్రాలు ఉన్నాయి. అయితే ఈ లిస్ట్ లోకి కేజిఎఫ్ కూడా ఇప్పుడు చేరబోతున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కే జి ఎఫ్.
ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అలాగే నిర్మాతలకు లాభాలను కూడా తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా కేజి ఎఫ్ చాప్టర్2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు.
నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ 14న సోలో గా రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్. కానీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్, అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా, విజయ్ బీస్ట్ చిత్రాలను అదే సమయానికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.
ఒకవేళ అదే కనుక నిజమైతే కేజిఎఫ్ 2 కు పోటీ తప్పదు. అటు బాలీవుడ్ నుంచి ఇటు తమిళ ఇండస్ట్రీ నుంచి అలాగే ఆర్ఆర్ఆర్ నుంచి పోటీ వస్తే కేజిఎఫ్ 2 నిలదొక్కుకోవడం కష్టమే. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేకర్స్ రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకోవాలి అని ఆలోచనలో ఉన్నారట. మరి చూడాలి ఏం జరుగుతుందో.