తమిళ స్టార్ హీరో శింబు నిధి అగర్వాల్ పెళ్లి చేసుకోబోతున్నారని గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల పై అధికారిక ప్రకటన ఎక్కడా రాలేదు. అయినప్పటికీ అటు శింబు ఇటు నిధి అగర్వాల్ స్పందించకపోవడంతో అందరూ నిజమే అని భావిస్తున్నారు.
ఇప్పటికే ఈ ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారట. త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నరట. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారట.
అయితే గతంలో కూడా శింబు ఇలా ప్రేమ పెళ్లి అంటూ చాలా సార్లు వార్తల్లో నిలిచాడు. కానీ అవేవీ జరగలేదు. మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.
ఇక శింబు, నిధి లు ఈశ్వరన్ సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారట. ఇక నిధి అగర్వాల్ ఇటీవల హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తోంది.