రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రాధే శ్యామ్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రేరణ పాత్రలో హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. విక్రమాదిత్య గా ప్రభాస్ కనిపించబోతున్నాడు. అలాగే పరమహంస పాత్రలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కనిపించబోతున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్, లుక్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన ఈచిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఎప్పటి నుంచో ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు మేకర్స్ నిర్ణయంతో నిరాశకు గురయ్యారు.
అయితే మళ్లీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే దానిపై అందరిలోనూ కొన్ని సందేహాలు ఉన్నాయి. మరోవైపు ఓటిటి రిలీజ్ అంటూ వస్తున్న వార్తలపై కూడా క్లారిటీ ఇస్తూ వస్తున్నారు మేకర్స్. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్ లోనే రిలీజ్ చేస్తామని చెబుతున్నారు.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను మార్చి నెల లోనే రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారట. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుందట.