ఆచార్య సినిమా నుండి మరో కీలక అప్డేట్ వచ్చేసింది. ఇటీవలే సినిమా షూటింగ్ మొదలుగా కాగా… వేగంగా చిత్రీకరణ సాగుతుంది. త్వరలోనే సినిమా యూనిట్ తో కొత్త పెళ్లి కూతురు కాజల్ కూడా జాయిన్ కాబోతున్నారు. తాజా అప్డేట్ ప్రకారం ఆచార్యలో ఓ కీలక రోల్ లో అరవింద్ స్వామి నటించనున్నారు. ఈ సోషల్ డ్రామాగా తెరకెక్కుతున్న మూవీలో అరవింద్ స్వామి విలన్ గా నటించనున్నారు. అరవింద్ స్వామి గతంలో రాంచరణ్ దృవ సినిమాలో విలన్ గా కనిపించారు.
ఇటీవలే అరవింద్ స్వామితో దర్శకుడు కొరటాల శివ చర్చలు జరిపి, స్క్రిప్ట్ వినిపించగా… అరవింద్ స్వామి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆచార్యకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తుండగా, మ్యాట్నీ మూవీస్ సంస్థ నిర్మిస్తుంది. ఆచార్యను 2021 వేసవిలో రిలీజ్ చేసే అవకాశం ఉంది.