మహేష్ బ్యాంకు అక్రమ నిధుల మళ్లింపు కు సంహరించిన ఖాతాదారులపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పటికే ఈ కేసు విషయంలో అరెస్ట్ ల పర్వం కొనసాగుతుంది. ఢిల్లీ, బెంగుళూరు, పూణే, ముంబై సహా ఉత్తరాది రాష్ట్రాలకు చేరుకున్న సిసిఎస్ పోలీసు బృందాలు బెంగుళూరు లో ముగ్గురిని, ఢిల్లీ లో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
అయితే కుంభకోణంలో పది నుండి పదిహేను శాతం కమీషన్ తీసుకుని నగదు విత్ డ్రా చేసి ప్రధాన సూత్రదారులు ఖాతాదారులకు అందచేశారు. పక్కా ప్లాన్ తోనే ముందస్తుగా ఖాతాదారులను సిద్ధం చేసుకున్నారు సూత్రదారులు.
పేద కుటుంబాలకు చెందిన యువత, విద్యార్థులకు కమీషన్ ఎరవేసి ముగ్గులోకి లాగారు. ఖాతాదారుల నుండి నగదు తెచ్చేందుకు ప్రత్యేకంగా ఇరవై మందికి పైగా నైజీరియన్లను నియమించుకున్నారు.