విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం థాంక్యూ. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశీ కన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇప్పటికే సగభాగం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. మిగిలిన భాగం కూడా కంప్లీట్ కావాల్సి ఉండగా బంగార్రాజు షూటింగ్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ వెనక్కి వెళ్ళింది. ఇక సంక్రాంతి కానుకగా వచ్చిన బంగార్రాజు చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసే పనిలో చితృ బృందం ఉందట. ఏప్రిల్ నాటికి ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి, ఆ తరువాత ప్రమోషన్స్‌ను మొదలుపెట్టాలని భావిస్తున్నారట.
అంతేకాదు ఉగాదికి టీజర్‌ని విడుదల చేయాలని, వేసవిలో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇకపోతే తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.