లింగుస్వామి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరీర్ లో19వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో తెరకెక్కబోతుంది.
ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా మంచి హైప్ క్రియేట్ అయింది. అయితే తాజాగా మేకర్స్ ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను సంక్రాంతి కానుకగా జనవరి 17న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
17 మధ్యాహ్నం 12 :07 నిమిషాలకు ఇది రివీల్ చేయనున్నారు. ఇక ఈ సినిమాకి ముందు రామ్ రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
అంతకన్నా ముందు ఇస్మార్ట్ శంకర్ సినిమా తో హిట్ ట్రాక్ ఎక్కాడు రామ్. అందులో నిధి అగర్వాల్, నభా నరేష్ హీరోయిన్ గా నటించారు.