సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ సర్కార్ వారి పాట సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో జరుగుతున్న ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా సంక్రాంతి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వివిధ కారణాలతో వాయిదా పడింది.
ఎట్టకేలకు ఏప్రిల్ 1న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ఇదిలా ఉండగా సంక్రాంతి నుంచి ఈ సినిమా అప్ డేట్స్ ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. మొదట గా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై మళ్లీ అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరి చూడాలి మేకర్స్ ఏ విధంగా ప్లాన్ చేస్తారో.