పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. భారీ అంచనాల మధ్య బ్యాంకింగ్ కుంభకోణం నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నిజానికి సంక్రాంతి కానుక రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఏప్రిల్ 1న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా ఇది కూడా కష్టమనే అనిపిస్తుంది.
ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ వినిపిస్తుంది. త్వరలోనే ఫస్ట్ సింగిల్ అలాగే రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇవ్వనున్నారట. ఇక తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు మహేష్ బాబు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమా కు కూడా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.