సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కు కూడా ఛాన్స్ ఉందని… ఆ పాత్రకోసం మేకర్స్ మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్‌ను తీసుకున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
అయితే చిత్ర యూనిట్ సన్నిహిత వర్గాలు నుంచి అందుతున్న సమాచారం మేరకు త్రివిక్రమ్ ఈ సినిమా సెకండ్ హీరోయిన్ కోసం ఇంకా వెతుకుతున్నాడట. సంయుక్త మీనన్ ను ఇంకా ఫిక్స్ చేయలేదట. సంయుక్త మీనన్ నటించిన భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.
మరి ఆ బంపర్ ఆఫర్ త్రివిక్రమ్ ఎవరికి ఇస్తారో చూడాలి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.
ఇక మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మే 12 న రిలీజ్ కాబోతుంది.