హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే తేజ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్నారు వైద్యులు. తాజాగా మరో హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. తేజ్ ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడిందని… వెంటిలేటర్ కూడా తొలగించామని తెలిపారు. అలాగే ఆయన స్పృహలో ఉన్నారని పూర్తిగా కోరుకుంటున్నాను అని ప్రకటించారు.
Advertisements
అంతే కాకుండా బాగా మాట్లాడుతున్నారని రెండు మూడు రోజుల్లోనే డిశ్చార్జ్ కూడా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తేజ్ ను నలుగురు వైద్యుల బృందం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అక్టోబర్ 1న తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా రిలీజ్ కానుంది.