రామ్ పోతినేని ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో చేస్తున్న సినిమా ది వారియర్. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా రామ్ కనిపించబోతున్నాడు.
ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ సినిమాలో రామ్ పోతినేని సిక్స్ ప్యాక్ తో మరోసారి కండలు చూపించబోతున్నాడట. గతంలో ఇష్మార్ట్ శంకర్ సినిమాలో సిక్స్ ప్యాక్ తో దర్శనమిచ్చాడు రామ్ పోతినేని.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన రెడ్ చిత్రం అనుకున్న స్థాయిలో కాకపోయినా పర్వాలేదనిపించింది.
మరి చూడాలి ది వారియర్ సినిమాలో రామ్ పోతినేని ఏ విధంగా కనిపిస్తారో. ఎలాంటి హిట్ ను అందుకుంటాడో.