కరోనా కారణంగా ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో లతా మంగేష్కర్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కాగా తాజాగా లతా మంగేష్కర్ కు చికిత్స చేస్తున్న డాక్టర్ ప్రతిత్ సమదానీ ఆమె ఆరోగ్య పరిస్థితి స్పందించారు.
లతా మంగేష్కర్ ఇప్పటికీ ఐసీయూలో ఉన్నారని…కానీ ఆమె ఆరోగ్యంలో స్వల్ప మెరుగుదల ఉందని తెలిపారు. ఆమెను ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షిస్తున్నారని అసత్య ప్రచారాలు ఎవ్వరూ నమ్మవద్దని అన్నారు.
ఇకపోతే లతా మంగేష్కర్ ఇప్పటి వరకు 30 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్ లతో పాటు భారతరత్న అవార్డు లను కూడా లతా మంగేష్కర్ దక్కించుకున్నారు.