ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వతం బద్ధలైంది. ఈ అగ్నిపర్వతం మౌనా లోవా దాదాపు 40 ఏళ్ల తర్వాత బద్ధలైంది. అగ్నిపర్వతం బద్దలవడంతో భారీగా లావా, బూడిదను వెదజల్లుతోంది. నవంబర్ 27న స్థానిక కాలమానం ప్రకారం సుమారు 11.30 గంటలకు అగ్నిపర్వతం బద్దలైంది. దాదాపు 33 మీటర్ల నుంచి 200 మీటర్ల ఎత్తు వరకు లావా ఎగిసిపడుతోంది. ఆదివారం రాత్రి నుంచి ఎరుపు రంగులో లావా పొంగుకొని వస్తోంది.
దీంతో పరిసర ప్రాంతాలన్నీ బూడిదతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో హవాయి కౌంటీ సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటివరకైతే దిగువ ప్రాంతాల్లోని ప్రజలకు దీనివల్ల ఏలాంటి ప్రమాదం లేదని అమెరికా జియోలాజికల్ వోల్కనిక్ యాక్టివిటీ సర్వీసెస్ వెల్లడించింది. కానీ లావా ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
అలాగే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నిపుణులు వెల్లడించారు. విస్ఫోటనానికి ముందు మౌనా లోవా చుట్టూ వరుస భూకంపాలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై 3.0 కంటే తక్కువ తీవ్రతతో 18 భూకంపాలు సంభవించాయి. మౌనా లోవా హవాయి గొలుసులో దక్షిణ చివరలో ఉంది.
Incredible close up footage of a fast flowing river of lava rushing from Hawaii’s Kilauea volcano.
Credit: Epic Lava Tourspic.twitter.com/HHp68VKvfl
— Wonder of Science (@wonderofscience) July 25, 2022
మౌనా లోవా అగ్నిపర్వతం సముద్ర మట్టానికి 13,670 అడుగుల ఎత్తులో ఉంది. ఇది గతంలో 1950లో విస్ఫోటనం చెందింది. అప్పుడు ఎగజిమ్మిన లావా కేవలం 3 గంటల్లోనే 5 మైళ్ల దూరం ప్రయాణించింది. మౌనాలోవా చివరగా 1984లో బద్దలవ్వగా.. 20 రోజుల పాటు లావా వెదజల్లింది.