ఈ మధ్య కాలంలో అక్కినేని ఫ్యామిలీ సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదనే మాట వాస్తవం. వీరి సినిమాలకు సంబంధించి ప్రస్తుతం ఫాన్స్ కూడా ఎదురు చూడటం లేదు. సమంతా తో నాగ చైతన్య విడిపోయిన తర్వాత పెద్దగా అవకాశాలు కూడా రావడం లేదనే టాక్ నడుస్తుంది.
Also Read:ట్విట్టర్ లో జై భీమ్ చర్చ #ఆస్కార్
ఇదిలా ఉంటే ఇటీవల నాగార్జున, నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన సినిమా బంగార్రాజు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ఇది సీక్వెల్ గా వచ్చింది. ఇక ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి నటించగా సినిమాకు మంచి స్పందనే వచ్చింది. వసూళ్ళ పరంగా కూడా సినిమా యూనిట్ కు పెద్ద నష్టాలు ఏమీ రాలేదని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది.
ఆ పాత్రే లావణ్య త్రిపాఠిది. ఈ సినిమాలో నాగ చైతన్య… నాగార్జునకు, రమ్యకృష్ణ కు మనవడి పాత్రలో నటించాడు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో రెండో నాగార్జున అయిన రాము, ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన లావణ్య త్రిపాఠిల కొడుకు నాగ చైతన్య అన్నట్టు. అంటే ఈ సినిమాలో నాగ చైతన్య కు తల్లిగా లావణ్య నటించింది. వాస్తవానికి వీళ్ళు ఇద్దరూ ఒక సినిమాలో హీరో హీరోయిన్ లు గా నటించారు. అంటే నాగ చైతన్య పక్కన రోమాన్స్ చేసింది, అతన్ని తల్లిగా లాలించింది లావణ్యనే.
Also Read:ఏపీ సేఫ్ @ కరోనా